మేష రాశి ఫలితాలు :-

మేష రాశి వారికి ఈ వారం చాలావరకు బాగుంది. గత వారం చెప్పిన దాంట్లో ఎలాంటి మార్పులు లేవు. వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. వీరికి ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ శని బలంగా ఉన్నారు. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే అదే నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది. ముఖ్యంగా ధనాధాయం అనేది బాగా పెరుగుతుంది. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రభుత్వ సంబంధిత విషయ వ్యవహారాలు ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి కలిసి బాటుతనంగా ఉంటుంది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టి బయటకు వెళితే అది దిగ్విజయంగా పూర్తి అవుతుంది. దుర ప్రాంత ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. స్థిరాచరాస్తుల విలువ పెరుగుతుంది. క్రయవిక్రయాలు లభిస్తాయి. కొత్త ఉత్సాహంతోటి ముందుకు వెళతారు. ఈ వారం ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. దైవారాధన ఎక్కువగా చేయటం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీరు ఎంచుకున్న విద్యలో వైద్య వృత్తిలో కావచ్చు మెకానికల్ ఇంజనీరింగ్ లో కావచ్చు సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించింది ఏదైనా సరే దాంట్లో మీరు రాణించగలుగుతారు. అయితే మనం చేయగలమా లేద అనే అనుమానం ఉంటుంది. వాటిని పక్కన పెట్టి మీ పని మీరు చేసుకోండి కాలం అనుకూలంగా ఉంది కాబట్టి ప్రయత్నం చేయటం మంచిది. ఎలాంటి ఆటంకాలు లేకుండా చేపట్టిన పని దిగ్విజయంగా పూర్తవుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా కలిసి వస్తుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. గత వారం కంటే ఈ వారం కొంతవరకు మెరుగ్గా ఉంటుంది. అదేవిధంగా పేరు ప్రఖ్యాతలు లభించే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి సినీ కళాకారులకు చిరుస్థాయి వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం కొంతవరకు లభిస్తుంది. క్రయవిక్రయాలు లభిస్తాయి. షేర్ మార్కెట్ కు దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఫిక్సడ్ డిపాజిట్స్ చేసుకోండి లేదా భూమి మీద పెట్టుబడి పెట్టండి భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణాయ వత్తులతో దీపారాధన చేయటం శని స్తోత్రం పటించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ఆరావళి కుంకుమ, కుబేర కుంకుమ తోటి అమ్మవారిని పూజించండి. ఎరుపు వత్తుల తోటి శనివారం నాడు నవగ్రహాల దగ్గర దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రదిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా రెండు కలసవచ్చే రంగు బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.


వృషభ రాశి ఫలితాలు :-

వృషభ రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది వ్యాపార రీత్యా మంచి కలిసి బాటుతనంగా ఉంటుంది. ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తి అవుతుంది. ఎక్కడికి వెళ్లిన పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కొద్దిగా కష్టపడితే ఫలితం ఎక్కువగా ఉంటుంది. గడచిన కొన్ని వారాల కంటే ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ప్రభుత్వ రంగానికి సంబంధించిన లీజులు కావచ్చు కాంట్రాక్టు పనులు కావచ్చు మీకు అనుకూలంగా వస్తాయి. ముఖ్యంగా లాయర్ వృత్తిలో ఉన్నవారికి డాక్టర్ వృత్తిలో ఉన్న వారికి టెక్నికల్ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి మంచి కలిసి బాటుతనంగా ఉంటుంది. ఈ రాశి వారు ఎక్కడికి వెళ్లినా ఏ పనిని ప్రారంభించిన లాభసాటిగా ఉంటుంది. కాబట్టి అవకాశాలు Everywhere సద్వినియోగ పరుచుకోండి. సంతానానికి సంబంధించిన విషయాలలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. వారి విద్య పట్ల కావచ్చు వారి ఆరోగ్యం పట్ల కావచ్చు చిన్నచిన్న ఇబ్బందులు ఎప్పుడూ ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉన్నప్పటికీ గురుగ్రహం అనుగ్రహం వలన అనుకున్న పనులు జరుగుతాయి . వాక్చాతుర్యంతోటి ఎలాగైనా పైకి రావాలని ఉద్దేశం తోటి ముందుకు వెళతారు. ఏ పని చేసినా నిదానంగా ఉన్నప్పటికీ ఫలితాలు మాత్రం మంచిగా ఉంటాయి . ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. దుర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత ప్రాజెక్టులు వచ్చే అవకాశం గోచరిస్తుంది గడచిన కొన్ని వారాల కంటే కూడా సాఫ్ట్వేర్ రంగంలోని వారికి చాలావరకు బాగుంటుంది. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం శని స్తోత్రం పటించండి మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా కుబేర కుంకుమ తోటి అమ్మవారిని పూజించండి చెప్పదగిన సూచన. దీని ద్వారా ధనాధాయం బాగుంటుంది రావాల్సిన సొమ్ము ఏదైతే ఉందో అది తిరిగి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ బుధవారం కాని వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

మిథున రాశి ఫలితాలు :-

మిథున రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. కుటుంబపరంగా ఆర్థిక పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు వస్తాయి. అయితే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. అయితే మీకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. మనోధైర్యంతో ఏపనినైనా చేయగలను అనే నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఆ ధైర్యంతోటే ఏ పని చేసినా మీరు ముందుకు వెళ్ళగలగతారు. కాబట్టి ఏ విధంగా సంకోచించకుండా పనులను ప్రారంభించండి. అమ్మవారి దయవలన అన్ని పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు చాలావరకు అనుకూలంగా ఉంది. చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పటించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారపరంగా బాగుంటుంది. స్థిరాస్తుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారు ప్రతిరోజూ ప్రతినిత్యం ఆరావళి కుంకుమ కుబేర కుంకుమ తోటి అమ్మవారిని పూజించడం, ఎరుపువత్తుల తోటి మంగళవారం నాడు శుక్రవారం నాడు దీపారాధన చేయండి. అదేవిధంగా శనివారం నాడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించండి. మంచి ఫలితాలు సంపాదిస్తాయి. ఈ రాశి లో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు గ్రే, ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలను సంప్రాప్తిస్తాయి.

కర్కాటక రాశి ఫలితాలు :-

కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. గతవారం కంటే ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పవచ్చు. ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తి అవుతుంది. వృత్తి ఉద్యోగులపరంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాల పరంగా వ్యాపారపరంగా మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు. ఏదైనా సరే మనం చేయగలం అనే దృఢ సంకల్పంతోటి ధైర్యం తోటి ముందుకు వెళ్లగలుగుతారు. ఏదైనా సరే మీరు సాధించగలుగుతారు. ఎలాంటి అనుమానాలు లేకుండా మీ పని మీరు చేయండి మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా సోదరి సోదరీమణుల మధ్య ఏవైతే మనస్పర్ధలు ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం కొంతవరకు బాగుంటుంది. ధనాదాయం బాగుంటుంది. రావలసిన ధనం ఏదైతే ఉందో అది మీ చేతికి అందుకుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు చాలావరకు అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. కష్టేఫలి అన్నట్లుగా కష్టానికి తగిన ప్రతిఫలం కొంతవరకు లభిస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అదే విధంగా మనం ఏదైనా సాధించగలం అనే ధైర్యంతో ముందుకు వెళ్లాలి. ఒక్కొక్కసారి నలుగురిలో ఇబ్బంది ఉండే అవకాశం కనిపిస్తుంది. అదేమీ పట్టించుకోకుండా విద్య మీద శ్రద్ధ వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అన్ని రంగాలలో బాగుంటుంది. నూతనంగా ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెడతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. విదేశాలలో చదువుతున్న వారు ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా ప్రయత్నించవచ్చు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు కాకుండా సొంతంగా చేసుకునే వ్యాపారాలు కలిసి వస్తాయి. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం రియల్ ఎస్టేట్ రంగం చిరుస్థాయి వ్యాపారస్తులకు చిరుధాన్య వ్యాపారస్తులకు ఆకుకూర వ్యాపారస్తులకు హోంఫూడ్ వ్యాపారస్తులకు హోటల్ మేనేజ్మెంట్ ఫార్మా రంగాల వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణాయ వత్తుల తోటి అరటి నార వత్తుల తోటి దీపారాధన చేయండి. అదేవిధంగా చతుర్ముఖ రుద్రాక్షలు మెడలో ధరించండి. ఆడవారు సౌర కంకణం కానీ ఇంద్రాణి రూపును కానీ చేతికి ధరించండి. మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా 4, కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.


సింహరాశి ఫలితాలు :-

సింహ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. గత వారం కంటే ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. అయితే ఖర్చులు మాత్రం అదుపులో ఉంచుకోవాలి. శుభకార్యాలకు ఎక్కువగా ఖర్చు పెడతారు. అదేవిధంగా సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకులంగా ఉన్నాయి. మంచి సంబంధం కుదురుతుంది. సంతానం విద్యలోనూ ఉద్యోగంలోనూ మంచి రాణింపు సాధిస్తారు. మనం కష్టపడినందుకు మన సంతానం మంచి వృద్ధిలోకి వస్తారు. అదేవిధంగా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళటం చెప్పదగిన సూచన. ప్రతి పనిలోనూ జీవిత భాగస్వామితో కలిసి చర్చించి ముందుకు వెళ్లినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే ఒక్కోసారి ఆఫీసులలో గాని కార్యాలయంలో గాని వ్యాపారంలో గాని చికాకు అనేది ఏర్పడుతుంది. అయితే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. దాని ద్వారా మనం చేపట్టిన పనులు సఫలీకృతం అవుతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. చార్టెడ్ అకౌంట్ వైద్య వృత్తిలో ఉన్న వారికి ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి కాలం కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సొంతంగా వ్యాపారం చేయాలని ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్లతో చర్చించి వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే అది సక్రమంగా నడుస్తుంది. అయితే కొన్ని అంతరంగిక విషయాలు అందరితో పంచుకోవడం సరైనది కాదు. ఈ రాశి వారు నవగ్రహ వత్తులతోటి దీపారాధన చేయాలి. శనికి తైలాభిషేకం చేయించడం లేదా అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు , నేవీ బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

కన్యా రాశి ఫలితాలు :-

కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారపరంగా మంచి లాభాలు ఉంటాయి. మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. భూ సంబంధిత విషయాలు వ్యవహారాలు, కోర్టుకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. వృత్తి ఉద్యోగాలలో పేరు ప్రఖ్యాతలు లభించే దిశగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వపరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవి సమసి పోతాయి. మీరు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరీక్షించి పై అధికారులకు మీ సహాయ సహకారాలు అందిస్తారు. మీరు సొంతంగా చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి కలుసుబాటుతనంగా ఉంటాయి. సమాజంలో మనకంటూ ఒక స్థానం సంపాదించుకోవాలనే ఆలోచన చేస్తారు. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. భూ సంబంధిత విషయాలు చాలావరకు అనుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు చాలావరకు అనుకూలంగా ఉంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి విదేశీ యానం ప్రయత్నం చేసే వారికి కాలం అనుకూలంగా ఉంది. ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పటించండి. మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు మనం కచ్చితంగా సాధించగలమనే మనోధైర్యం తోటి ముందుకు వెళతారు. వారు అనుకున్నట్టుగానే వారు చేపట్టిన పనిలో అభివృద్ధిని చూస్తారు. వ్యాపార రీత్యా కూడా మంచి లాభాలు అందుకుంటారు. గడిచిన వారం కంటే ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పటించడం, ఇంద్రాణి రూపు మెడలో ధరించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా మంగళవారం నాడు శుక్రవారం నాడు కుబేర కుంకుమ తోటి అమ్మవారికి పూజ చేయటం ఒక ఐదుగురు ముత్తైదువులకు తాంబూలం ఇవ్వండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు గ్రీన్ ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

తులా రాశి ఫలితాలు :-

తులా రాశి వారికి ఈ వారం బాగుంది. ఈ రాశి వారికి ఈ వారం లాభాలు బాగుంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయి ఖాళీగా ఉన్న వారికి వెంటనే మంచి ఉద్యోగం లభిస్తుంది. దైవదర్శనాలు ఎక్కువగా చేరుకుంటారు. విహారయాత్రలు విందు వినోదాల కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతానం చాలా అనుకూలంగా ఉంది. సంతానానికి సంబంధించిన వివాహ విషయాలు సానుకూల పడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. కొన్ని పనులు అనుకొని సంఘటనలు బాగుపడటం జరుగుతుంది. అనుకోకుండా కొన్ని అవకాశాలు కలిసి రావడం జరుగుతుంది. ఏ పని చేసినా ఎక్కడికి వెళ్లినా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయితే ఒక నూతన వ్యాపారం ప్రారంభించాలనే యోచన చేస్తారు. ఇలాంటివారు చక్కగా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. కాలం అనుకూలంగా ఉంది. అయితే భాగస్వామ్య వ్యాపారాలు కాకుండా సొంత వ్యాపారాలు ప్రారంభించండి. కలిసిబాటుతనంగా ఉంటుంది. అయితే ఒక స్థలాన్ని అమ్మేసి అప్పులు తీర్చాలని చూస్తారు అదే ఈ వారం నెరవేరుతుంది. ఆరోగ్యపరంగా ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు ఎంతో మేలు చేస్తాయి. మీరు ఎక్కడికి వెళ్లినా సరే మీ ప్రయత్నం లోపం లేకుండా కష్టపడతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారే అవకాశం కనిపిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్లినా సరే మనం బాగుండాలి పది మంది బాగుండాలి అనే ఆలోచన చేస్తారు. ఖర్చులు కాస్త అదుపులో ఉంచుకోవాలి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజించటం 11 మంది ముత్తయిదువులకు తాంబూలం ఇవ్వడం చెప్పదగిన సూచన. తద్వారా మీరు కోరుకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి రంగు మెరూన్ ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

వృశ్చిక రాశి ఫలితాలు :-

వృశ్చిక రాశి వారికి ఈ వారం గతవారం కంటే చాలా వరకు బాగుంది. ప్రభుత్వ సంబంధిత ఉద్యోగ ప్రయత్నాలు ఇప్పటినుంచే ప్రారంభించండి. సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ మరియు ఇతర ప్రభుత్వ రంగ ఉద్యోగాలకు ప్రయత్నం చేసేవారు ఇప్పటినుంచే ప్రారంభించండి. కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగం వచ్చే అవకాశం కూడా గోచరిస్తుంది. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలోని వారికి సినీ కళా రంగాల వారికి అదేవిధంగా టెక్నికల్ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ అదే విధంగా భూ సంబంధిత విషya వ్యవహారాలలో ఫార్మసీ రంగం వారికి చిరుధాన్య వ్యాపారస్తులకు చిరు వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. ఏదైనా సరే ఈ వారం ఈ రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు చాలావరకు అనుకూలంగా ఉంది. నూతన కోర్సులు నేర్చుకునే వారికి కాలం కలిసి వస్తుంది. కోర్సులు సెలెక్ట్ చేసుకునేటప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. భవిష్యత్తుకు మీ ఆలోచనలకు తగ్గట్టుగానే సరైన కోర్సుల ఎంపిక చేసుకోవడం చెప్పదగిన సూచన. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగులపరంగా వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవే కలిసి వస్తాయి. శుభకార్యాలు నిర్వర్తిస్తారు. సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంది. మంచి సంబంధం కూడా కుదురుతుంది. అదేవిధంగా ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పటించడం చెప్పదగిన సూచన. అదే విధంగా మంగళవారం నాడు శుక్రవారం నాడు కుబేర కుంకుమ మొగలిపువ్వు కుంకుమ తోటి అమ్మవారిని ఆరాధించడం చెప్పదగిన సూచన. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు గ్రీన్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

ధనుస్సు రాశి ఫలితాలు :-

ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తి అవుతుంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి ముందుకు వెళ్ళటం చెప్పదగిన సూచన. దూరప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. అయితే ఈ రాశి వారు ఏ పని ప్రారంభించిన విజయవంతం అవ్వకుండా నిరాశ గానే ఉంటుంది. దీని వలన ఈ రాశి వారు మానసిక ఒత్తిడికి గురి అవుతారు. అయితే అలాంటివేమీ పట్టించుకోకుండా సరైన ఆలోచనతోటి ముందుకు వెళితే మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వారు సాఫ్ట్వేర్ రంగం వారు చిరు స్థాయి వ్యాపారస్తులు హోటల్ మేనేజ్మెంట్ వారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారు కాస్మోటిక్ రంగం వారు డాక్టర్స్ కిఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. మంచి పేరు ప్రఖ్యాతలు కూడా లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ఎటువంటి ఇబ్బందులు లేని వాతావరణముంటుంది. చిన్నచిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని పక్కనపెట్టి మీ పని మీరు చేసుకోండి. వాటి అంతట అవే సమసి పోతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు. వైద్య వృత్తిలో ఉన్న వారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విదేశాల్లో చదువుకునే వారికి స్టూడెంట్స్ లోను మంజూరు అవుతుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వారికి పోలీసు రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రయత్నాన్ని ఇప్పటినుంచి ప్రారంభిస్తే భవిష్యత్తు బాగుంటుంది. మీరు కోరుకున్న రంగంలో రాణిస్తారు. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపారపరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. గడిచిన వారం కంటే ఈ వారం ఈ రాశి వారికి ఇంకా బాగుంది. కొంత మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు ప్రారంభించిన పనిని చివరకు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఖర్చులు మాత్రం అదుపులో పెట్టుకోవాలి. ఎక్కువగా ఖర్చులు ఉండే అవకాశం గోచరిస్తుంది. సంతాన భాగ్యం కలుగుతుంది. సంతానంకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. సంతాన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ రాశి వారు ప్రతిరోజూ ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం శని స్తోత్రం పఠించండి మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయటం మగవారు చతుర్ముఖి రుద్రాక్షను మెడలో ధరించటం ఆడవారు కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు తెలుపు ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు గురువారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

మకర రాశి ఫలితాలు :-

మకర రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగానే ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కాలం కలిసి వస్తుంది. కొన్ని అవకాశాలు చేతిదాక వచ్చి చేజారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. పదిమంది సలహాలు సూచనలు తీసుకున్నప్పటికీ మీరు సరైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళటం చెప్పదగిన సూచన. గుడ్డిగా పదిమంది సలహాలు సూచనలు పాటించడం ద్వారా నష్టపోయేది మీరే కావున సరైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళండి. వివాహానికి సంబంధించిన విషయాలు బాగున్నాయి. ఉద్యోగ విషయాలు కూడా బాగున్నాయి. వ్యాపార పరంగా కూడా బాగుంటుంది. అయితే సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లినట్లయితే మరింత బాగుంటుంది. ఈ రాశి వారికి మంచి అవకాశాలు ఉన్నాయి కానీ వాటిని సద్వినియోగపరుచుకోవడంలో మీరు సరైన నిర్ణయం తీసుకోవాలి. మన జీవితం ఇంతేనేమో మనం ఏమి చేయలేమేమో అనే కొన్ని అపనమ్మకాలు కూడా ఉంటాయి వాటి పక్కన పెట్టి మీ ప్రయత్నాన్ని మీరు చేయండి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ రాశి వారు ఉన్న ఉద్యోగంలో స్థిరత్వం కోసం పని చేయండి ఉద్యోగములో స్థానాచలనం కోసం ప్రయత్నం చేయవద్దు కాలం కలిసి రాదు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు చాలావరకు అనుకూలంగా ఉంది. చదువులో మంచి అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి మరిన్ని మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోండి. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పటించడం దక్షిణామూర్తి రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలలో మంచి స్థాయిని సంపాదించుకుంటారు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఏదైనా ఒక పనిని తలపెట్టేటప్పుడు పెద్దల అనుమతి తీసుకోవడం చెప్పదగిన సూచన. దైవానుగ్రహంతో ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటినుంచో వివాహ ప్రయత్నాలు చేసి సంబంధం వచ్చి చేజారిపోయిన వారికి కూడా మంచి సంబంధం కుదురుతుంది. అయితే ఇరువురి జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్లడం చెప్పదగిన సూచన. తద్వారా భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశి వారు ప్రతిరోజు అమ్మవారికి కుబేర కుంకుమ తోటి కుంకుమార్చన చేయటం పెళ్లి కాని వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు ఆరావళి కుంకుమతోటి ప్రతినిత్యం అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. అదేవిధంగా శుక్రవారం నాడు మొగలిపువ్వు కుంకుమ తోటి అమ్మవారిని ఆరాధించండి. కుదిరితే శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి అర్చన చేయించండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు కాషాయం ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

కుంభ రాశి ఫలితాలు :-

కుంభరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆరోగ్య రీత్యా కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఏదో తెలియని మనోవేదన ఎక్కువగా ఉంటుంది. అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి కొన్ని టెస్ట్ లు కూడా చేయించుకోవాలి. అదేవిధంగా సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చినప్పటికీ అవి సమసి పోతాయి. అదేవిధంగా ఈ రాశి వారికి రావలసిన ధనం ఏదైతే ఉందో అది కొంతవరకు చేతికి అందుతుంది. వ్యాపారం అంతంత మాత్రాన ఉన్నప్పటికీ లాభాలు బాగుంటాయి. ఎప్పుడో కొన్న సిరాసుల విలువ పెరగటం రియల్ ఎస్టేట్ పరంగా మంచి లాభాలు వస్తాయి. విద్యాపరంగా ఉద్యోగ పరంగా మంచి అనుకూలత ఉంటుంది. ఈ రాశి వారికి కుటుంబ స్థానం కూడా బాగుంది. విద్యార్థిని విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులు అవుతారు. మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. చదువులో అందరికంటే ముందుండాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. అదేవిధంగా దూర విద్య కోసం చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి సాఫ్ట్వేర్ రంగంలోని వారికి చిరుస్థాయి వ్యాపారస్తులకు కాస్మోటిక్ బ్యూటీషియన్స్ ఫార్మా రంగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అదేవిధంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అయితే శుభకార్యాలు ఘనంగా నిర్వర్తిస్తారు. సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు బాగున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహము అయ్యే అవకాశం కూడా గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార రీత్యా చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో మాత్రం స్థానచలణం ఉంటుంది. ఉన్న ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగానికి మారతారు. అదేవిధంగా విదేశాలలో ఉన్న వారికి విదేశాలలో వ్యాపారం చేస్తున్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. చేతిదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోయే విధంగా కాకుండా గట్టిగా ప్రయత్నం చేయండి. కచ్చితంగా కలిసి వస్తుంది. భూ సంబంధించిన క్రయవిక్రయాలు లాభసాటిగా ఉంటాయి. కష్టేఫలి అన్నట్లు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయటం మంగళవారం నాడు శనివారం నాడు ఆంజనేయస్వామికి ఆకు పూజ చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎవరైతే విదేశీయానం ప్రయత్నం చేస్తున్నారో ప్రయత్నాలు ఇప్పటినుంచే ప్రారంభించండి. విదేశాలకు వెళ్లే అవకాశాలు చక్కగా ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు నేవీ బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

మీన రాశి ఫలితాలు :-

మీన రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. శని బలంగా ఉన్నారు. ఏదైనా పనిని ప్రారంభిస్తే ఈ రాశి వారు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశీ యానం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఏదైనా ఒక పనిని చేయాలనుకున్నప్పుడు వాయిదా వేయకుండా వెంటనే చేయండి మంచి ఫలితాలు తప్పకుండా ఉంటాయి. సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు వారి విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. మీరు పడ్డ కష్టానికి పిల్లలు వృద్ధిలోకి వచ్చారు అనే భావన ఎక్కువగా ఉంటుంది. స్నేహితుల దగ్గర సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. ఏదైనా సరే పిల్లలు బాగుండాలి వారి జీవితం బాగుండాలి అని చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. సంపాదనకు తగిన ఖర్చులు ఉంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. నిదానంగా ఆలోచించి అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు చేయండి. భూ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి కలిసి బాటుతనంగా ఉంటుంది. ప్రయత్నాలు ప్రారంభించండి కొత్త ప్రాజెక్టుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి వ్యాపారస్తులకు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. మీనరాశి వారికి గడిచిన వారం బాగుంది అదే విధంగా ఈ వారం అంతకంటే ఇంకా బాగుంది. మీ వ్యవహార శైలితో చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. నలుగురితో కలిసి ఉండాలి చేసిన తప్పులు మళ్ళీ చేయకూడదు అనే భావనతోటి ఉంటారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనే ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది. మీ పక్కన ఉన్నవాళ్లే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి . మీరు ఎప్పటినుంచో నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేశారు అనే బాధ ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు పొగడ్తలకు పోయి మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇకనుంచైనా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు దేవుడిని నమ్ముకొని మన ప్రయత్నం మనం చేసుకోవాలి. ఒకరి మీద ఆధారపడకూడదు అనే భావనతోటి ముందుకు వెళతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని శుభకార్యాలు నెరవేరుతాయి. వివాహ ప్రయత్నాలు పునర్వివాహ ప్రయత్నాలు సానుకూల పడతాయి. పెద్దలతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అన్నీ మనకే తెలుసు మనకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదనే ధోరణి కూడా ఏర్పడుతుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణాయ వత్తులతో దీపారాధన చేయటం శుక్రవారం నాడు అమ్మవారికి కుబేర కుంకుమ తోటి కుంకుమార్చన చేయటం అదేవిధంగా నవగ్రహవత్తులతో శనివారం నాడు దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. దీని ద్వారా ఏలినాటి శని ఉన్నవారికి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. కొన్ని కార్యక్రమాలు తప్పకుండా పూర్తి చేస్తారు. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టాలి అని అనుకుంటారు కానీ మధ్యలోనే ఆటంకం రావడం వలన ఆ పనిని పక్కన పెడతారు. ఏ రోజు పనిని అదే రోజు చేయండి వాయిదా వేయకుండా ఉండండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు స్కై బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.