ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ రెనాల్ట్ భారత మార్కెట్లో మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో అందిస్తున్న డస్టర్‌కు కొత్త అడ్వెంచర్ ఎడిషన్‌ను అధికారికంగా విడుదల చేసింది. స్టైలిష్ డిజైన్, ప్రత్యేక అడ్వెంచర్ థీమ్, ఆధునిక ఫీచర్లతో ఈ ఎడిషన్‌ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. రెనాల్ట్ డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్‌లో ప్రత్యేక అడ్వెంచర్ డెకల్స్‌ను అందించింది. అలాగే 34.27 N, 77.60 E అనే భౌగోళిక కోఆర్డినేట్లను కూడా వాహనంపై పొందుపరిచింది. డస్టర్‌ను కఠినమైన భూభాగాల్లో పరీక్షించిన ప్రాంతాలకు గుర్తుగా ఈ కోఆర్డినేట్లను ఉపయోగించినట్లు కంపెనీ తెలిపింది.


అదిరిపోయే ఫీచర్లు

ఈ కొత్త ఎడిషన్‌లో వినియోగదారులకు పలు ప్రీమియం ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే

1. ఫుల్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు

2. ఎలక్ట్రిక్ పానోరమిక్ సన్‌రూఫ్

3. ఎలక్ట్రిక్ పవర్డ్ టెయిల్‌గేట్

4 కనెక్టెడ్ కార్ టెక్నాలజీ

5. ఆటో డ్యుయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్

6. 25.65 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

7. 17 అంగుళాల అలాయ్ వీల్స్

8. అడ్వెంచర్ డెకల్స్

9. అడ్వెంచర్ ఎంబెలిషర్

10. అడ్వెంచర్ ఫ్లోర్ మ్యాట్స్


ఇంజిన్‌

అడ్వెంచర్ ఎడిషన్‌లో ఇంజిన్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో టర్బో TCe 160 ఇంజిన్‌ను కొనసాగించింది. ఈ ఇంజిన్ గరిష్టంగా 153 PS పవర్, 280 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదనంగా టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపిక కూడా అందుబాటులో ఉంది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో పాటు ఆఫ్-రోడింగ్ సామర్థ్యాన్ని కూడా ఈ ఎస్‌యూవీ కలిగి ఉంది.


ధర ఎంత?

రెనాల్ట్ డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ టర్బో TCe 100 MT వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.12.99 లక్షలుగా నిర్ణయించింది. ఇక టాప్ వేరియంట్ ధర రూ.15.39 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.