
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ విజయంలో క్లాసెన్ కీలక పాత్ర పోషించాడు. అయితే క్లాసన్ ప్రవర్తనతో మరోసరొ వార్తల్లో నిలిచాడు. అనుమతి లేకుండా తన కుటుంబసభ్యల ఫోటోలు, వీడియోలు తీసినందుకు క్లాసెన్ ఓ ఫ్యాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. కానీ, ఇందులో క్లాసెన్ ఫేస్ మాత్రం కనిపించలేదు.
ముంబై ఇండియన్స్ పై విజయం తర్వాత ఎస్‌ఆర్‌హచ్ ఆటగాళ్లు తిరిగి హైదరాబాద్‌కి పయనమయ్యారు. ఈ సమయంలో ఓ అభిమాని క్లాసెన్‌ను పలకరించాడు. ‘‘మీరు చాలా బాగా ఆడారు’’ అని అన్నాడు. దీనిపై స్పందించిన క్లాసెన్.. ‘‘థాంక్యూ వెరి మచ్ సర్.. అయితే మీరు దయచేసి ఫోటోలు, వీడియోలు తీయొద్దు. నేను అటు తిరిగితే నా ఫ్యామిలీ ఫోటోలు తీస్తారు. కానీ, అలా చేయొద్దు. మీరు ఆపకపోతే మాత్రం మిమ్మల్ని మట్టికరిపిస్తాను’’ అని వార్నింగ్ ఇచ్చాడు. దీనిపై సోషల్ మీడియాలో అభిమానులు క్లాసెన్‌కు మద్దతుగా నిలిచారు. ప్రైవసీకి భంగం కలిగించొద్దని కామెంట్లు చేశారు.












