
ఐపిఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏడో విజయాన్ని అందుకుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్, పంజాబ్ పట్టుపై 33 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. సన్ రైజర్స్ నిర్దేశించిన 236 పరుగుల లక్ష్య ఛేదనలో కాన్లీ(107 నాటౌట్) శతకంతో చెలరేగినా.. పంజాబ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 202 పరుగులు మాత్రమే చేయగలిగింది.మిగత బ్యాటర్లు విఫలమవ్వడంతో కాన్లీ ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. సన్ రైజర్స్ బౌలర్లలో కమిన్స్, శివాంగ్ లు చెరో రెండు వికెట్లు తీయగా.. నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ మలింగ, హుస్సేన్ లు తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో హైదరాబాద్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
కాగా, ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(35), ట్రావిస్ హెడ్(38)లు మరోసారి అదిరే ఆరంభాన్ని అందించారు. తర్వాత ఇషాన్ కిషన్(55), క్లాసెన్(69)లు అర్ధ శతకాలతో చెలరేగారు. వీరితోపాటు నితీష్ రెడ్డి(29 నాటౌట్) కూడా ధనాదన్ బ్యాటింగ్ తో అలరించాడు. దీంతో ఎస్ఆర్ హెచ్, పంజాబ్ పట్టుకు 236 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, ఫర్గూసన్, వైషాకా, చాహాల్ లు తలో వికెట్ తీసుకున్నారు.












