
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ అధికారులను భారీ ఎత్తున బదిలీ చేసింది. ఇందులో పలువురు కీలక శాఖలు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న సంజయ్ కుమార్‌ను డిల్లీలోని తెలంగాణ భవన్‌ను స్పెషల్ ఆఫీసర్‌గా బదిలీ చేసింది. అలాగే ఆర్ధిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న దాన కిశోర్‌ను సంజయ్ కుమార్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్లూఎస్ శాఖలకు నియమించింది. హైదరాబాద్ కలెక్టర్‌గా ఉన్న హరిచందనను దాన కిషోర్ నిర్వహిస్తున్న ఆర్ధిక శాఖకు కార్యదర్శిగా బదిలీ చేసింది. ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్‌గా ఉన్న కృష్ణ ఆదిత్యను ఇండస్ట్రీస్, కామర్స్ శాఖల స్పెషల్ సెక్రటరీగా నియమించింది.
రాష్ట్ర సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల ఇంచార్జ్ కమిషనర్‌గా ఉన్న బి. విజేయంద్రను ఆదే శాఖకు కమీషనర్‌గా నియమించి పూర్తి బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా ఉన్న హనుమతు కొండిబా ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సిఇఓగా నియమించింది. సంగారెడ్డి కలెక్టర్‌గా పనిచేస్తున్న పి.ప్రావీణ్యను ఆర్అండ్బి శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీ చేసింది. ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా ఉన్న బి.ఎం సంతోష్‌ను అదే శాఖకు స్పెషల్ సెక్రటరీగా నియమించింది. ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా ఉన్న అనుదూప్ దూరిశెట్టిని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కామర్స్ శాఖకు జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించింది. నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్‌ను ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్‌గా నియమించింది. నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్‌గా ఉన్న జి.వి శ్యామ్ ప్రసాద్‌ను పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా నియమించింది. జిహెచ్ఎంసి గొల్గొండ జోనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ముకుందారెడ్డిని సమాచార పౌర సంబంధాల శాఖకు ప్రత్యేక కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. జిహెచ్ఎంసి కూకట్పల్లి జోనల్ కమిషనర్‌గా ఉన్న అపూర్వ చౌహన్‌ను సిఎం ఆర్ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించింది.
హైదరాబాద్ కలెక్టర్‌గా ప్రియాంక ఆల
హైదరాబాద్ కలెక్టర్‌గా ప్రియాంక ఆల నియమితులయ్యారు. నిర్మల్ జిల్లా కలెక్టర్‌గా భవేశ్ మిశ్రా, సంగారెడ్డి కలెక్టర్‌గా ప్రతీక్ జైన్, ఖమ్మం కలెక్టర్‌గా టిఎస్ దివాకర్, ములుగు జిల్లా కలెక్టర్‌గా బోర్ఖడే హేమంత్ సహదేవ్‌రావు, నారాయణపేట జిల్లా కలెక్టర్‌గా చెక్కా ప్రియాంక, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్‌గా హేమంత్ కేశవ్ పాటిల్, ఉట్నూరు ఐటిడిఎ పిఒగా మంద మకరందు, ఏటూరు నాగారం ఐటిడిఎ పిఒ లెనిన్ వత్సల్ టోప్పో, రంగారెడ్డి కలెక్టర్ (లోకల్ బాడీస్)గా కిరణ్మయి కొప్పిశెట్టి, కొమురం భీం ఆసిఫాబాద్ అడిషినల్ కలెక్టర్ (లోకల్ బాడీస్)గా యువరాజ్ మార్మట్ నియమితులయ్యారు.
జిహెచ్ఎంసిలో ఆరు జోన్లకు కొత్త కమిషనర్లు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) పరిధిలో ఆరుగురు ఐఎఎస్‌లను జోనల్ కమిషనర్లుగా ప్రభుత్వం నియమించింది. గోల్కోండ జోనల్ కమిషనర్‌గా పి.ఉదయ్ కుమార్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా బాదావత్ సంతోష్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ మాలెంపాటి, ఎల్బి నగర్ జోనల్ కమిషనర్‌గా వికాస్ మహతో, కూకట్పల్లి జోనల్ కమిషనర్‌గా మయాంక్ సింగ్, రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా ఎస్.శ్రీనివాస్‌రెడ్డిలు నియమితులయ్యారు.











