
చెన్నై: నటుడు అజిత్ కుమార్ తల్లి మోహిని మణి(85) కన్నుమూశారు. ఆమె గత కొలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దుబాయ్ ఉన్న అజిత్ విషయం తెలియగానే చెన్నైకు బయలుదేరారు. పలువురు సినీ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటంబానిక ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరలని ప్రార్థించారు. అజిత్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మోహిని అంత్యక్రియలు రేపు చెన్నైలో జరగనున్నాయి. మూడు సంవత్సరాల క్రితం అజిత్ తండ్రి సుభ్రమణ్యం మృతి చెందిన విషయం తెలిసిందే.













