అహ్మదాబాద్: ఐపిఎల్‌లో భాగంగా గురువారం జరిగే కీలక మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకమనే చెప్పాలి. ఢిల్లీతో జరిగిన కిందటి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన ఆర్‌సిబి ఈ పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇందులోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు బలంగా ఉంది. ఇక గుజరాత్‌కు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది.