
హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రులు కెటిఆర్, హరీశ్ రావులకు హైకోర్టులో ఊరట లభించింది. మిలియన్ మార్చ్ సందర్భంగా నమోదైన కేసులను కోర్టు కొట్టివేసింది. ట్యాంక్‌బండ్‌పై 2011లో నిర్వహించిన మిలియన్ మార్చ్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దర్యాప్తులో భాగంగా కెసిఆర్, కెటిఆర్, హరీశ్‌రావును నిందితులుగా చేర్చారు. ఈ కేసులో వీరికి ఎలాంటి సంబంధం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. దీంతో వీరిపై నమోదైన కేసులను కోర్టు కొట్టివేసింది.



