
హైదరాబాద్: తెలంగాణ నూతన డిజిపిగా సివి ఆనంద్‌ను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత డిజిపి శివధర్ రెడ్డి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత సివి ఆనంద్ మే మొదటి వారంలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సివి ఆనంద్ ఉన్నారు. తాజాగా జరిగిన బదిలీల్లో ఆ స్థానంలో శిఖా గోయెల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.



