
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మీర్ పేటలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. కారు బీభత్సం చేసింది. బైక్ పై తండ్రి, కుమారుడు ఎల్‌బీనగర్ వైపు వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ఓ కారు వేగంగా వారిని ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత ఇరువురి మధ్య వాగ్వాదం జరగడంతో కారు డ్రైవర్ తండ్రి కుమారుడిపై దాడికి దిగాడు. కారును ఆపేందుకు యత్నించిన తండ్రిని డ్రైవర్ బానెట్ పైకి ఎక్కించి కారు ఆపకుండా దాదాపు 2 కి.మీ. ఈడ్చుకెళ్లాడు. బాలాపూర్ చౌరస్తా వరకు కారు డ్రైవర్ తిరిగి వచ్చాడు. స్థానికులు అడ్డుకోవడంతో బాధితుడిని వదిలి కారు డ్రైవర్ పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












