
హీరోయిన్ రష్మిక నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మైసా’. ఫస్ట్‌లుక్ పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. అయితే ఈ సినిమాకు సంబంధిచి ఓ వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది, ఈ సినిమా కోసం రష్మిక ఓ భారీ యాక్షన్ సన్నివేశంలో ఎలాంటి డూప్ లేకుండా చేసిందని డైరెక్టర్ రవీంద్ర పుల్లె చెప్పారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
‘‘రష్మిక పోషిస్తున్న పాత్ర పేరు ‘మైసా’. చాలా ప్రభావవంతమైన పాత్ర. ఆమె ప్రదర్శించే కోపం, ఆవేశం ఈ సినిమాకు హైలైట్. ఇటీవలే కేరళలోని అతిరపల్లి జలపాతం వద్ద ఓ క్లిష్టమైన యాక్షన్ సన్నివేశం చిత్రీకరించాం. రష్మిక డూప్ లేకుండా 80 అడుగుల ఎత్తు నుంచి దూకారు. ఆ సమయంలో ఆమె చేతులకు, కాళ్లకు గాయాలయ్యయ. అయినా కూడా విరామం తీసుకోకుండా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆమె నిబద్ధత చూసి చిత్ర బృందమంతా ఆశ్చర్యపోయింది’’ అని రవీంద్ర తెలిపారు.












