స్మార్ట్ ఫోన్ సంస్థ పోకో ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్లలో సరికొత్త మొబైల్ ను లాంచ్ చేసింది. కంపెనీ దీనిని పోకో C81 ప్రో పేరిట విడుదల చేసింది. వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ డిస్‌ప్లేను కలిగి ఉన్న ఈ పరికరాన్ని కంపెనీ తన C-సిరీస్ కింద పరిచయం చేసింది. ఇందులో యూనిసోక్ T7250 చిప్‌సెట్ కూడా ఉంది. ఈ పరికరం 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 13-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 6,000mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఇప్పుడు పోకో C81 ప్రోకు సంబంధించి ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.


పోకో C81 ప్రో ధర

కంపెనీ ఈ పరికరాన్ని మూడు స్టోరేజీ వేరియంట్లలో లాంచ్ చేసింది. అవి 4GB RAM + 64GB స్టోరేజ్‌ వేరియంట్ ధర $99 (సుమారు ₹9,300) నుండి ప్రారంభమవుతుంది. అలాగే, 4GB RAM + 128GB, 4GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ల ధరలు వరుసగా $109 (సుమారు ₹10,000)గా, $129 (సుమారు ₹12,000)గా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్, గోల్డ్, గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. ఇది భారత టెక్ మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుందనే దానిపై పోకో ఇండియా ఇంకా అధికారిక ప్రకటన లేదు.

పోకో C81 ప్రో ఫీచర్లు

ఈ ఫోన్‌లో 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉంది. ఇది 120 Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ 650 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌ను, హై-బ్రైట్‌నెస్ మోడ్‌లో 800 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ముందు స్క్రీన్‌లో సెల్ఫీ కెమెరా కోసం వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ ఉంది. ఈ ఫోన్‌కు 12nm ప్రాసెస్ ఉపయోగించి నిర్మించిన ఆక్టా-కోర్ యూనిసోక్ T7250 ప్రాసెసర్ శక్తిని అందిస్తుంది. ఈ పరికరంలో మాలి-G57 GPU, 4GB LPDDR4x RAM, 256GB వరకు UFS 2.2 స్టోరేజ్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా, ఈ ఫోన్ RAMను 8GB వరకు విస్తరించుకోవచ్చు.

ఫోటోగ్రఫీ కోసం, పోకో C81 ప్రోలో f/2.2 అపర్చర్‌తో కూడిన 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో అదనంగా మరో లెన్స్ కూడా ఉంది. సెల్ఫీల కోసం, ఇందులో f/2.0 అపర్చర్‌తో కూడిన 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 6,000mAh బ్యాటరీతో 15W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ ఇస్తుంది.