
హైదరాబాద్: క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి హేమ. తాజాగా ఆ ఓ ఖరీదైన కారును కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. కొత్త కారుకు ఆలయంలో పూజలు నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌మీడియా ద్వారా షేర్ చేసింది. దీంతో హేమ అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
ప్రముఖ మెర్సిడెజ్ బెంజ్ బ్రాండ్ కారును హేమ కొనుగోలు చేసింది. ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఈ లగ్జరీ కారు ఖరీదు దాదాపు రూ.కోటిన్నర పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. పూజ అనంతరం కారును హేమ స్వయంగా నడుపుతూ వీడియోలో కనిపించింది.









