
హైదరాబాద్: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.993 పెంచామని చమురు సంస్థలు తెలిపాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.3,071 హైదరాబాద్ లో రూ.3315 కు చేరింది, ఎల్ పిజి సిలిండర్ ధరల్లో మార్పులు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అమెరికా-ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దం నడుస్తుండడంతో హర్మూజ్ జలసంధిలో ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో భారత్ లో మూడు సార్లు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచారు. మార్చిలో రూ.144, ఏప్రిల్ లో రూ.195, ఇప్పుడ ఏకంగా రూ.993 పెంచడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. మూడు వేల రూపాయలు పెట్టి సిలిండర్ తీసుకోవడం కంటే హోటళ్లు, రెస్టారెంట్లు మూసుకోని కూర్చోవడం బెటర్ అని యజమానులు వాపోతున్నారు. పెట్రోల్, డీజిల్ లో మార్పులు లేవు.











