
అమెరికాకు చెందిన దిగ్గజ ఐటి సంస్థ కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా 15,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. దీనిలో అత్యధిక ప్రభావం భారతదేశంపైనే ఉండనుంది, ఎందుకంటే కంపెనీకున్న 3,57,000 మంది సిబ్బందిలో 2,50,000 మంది ఇక్కడే పనిచేస్తున్నారు. ఈ తొలగింపుల కోసం కంపెనీ 320 మిలియన్ డాలర్ల పరిహారాన్ని కేటాయించింది. ’ప్రాజెక్ట్ లీప్’ పేరుతో చేపట్టిన పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో ఉద్యోగికి ఆరు నెలల జీతాన్ని పరిహారంగా అందించే అవకాశం ఉంది. ఈ ఏడాది టెక్ రంగంలో ఇది అతిపెద్ద ఉద్యోగ కోతగా నిలవనుంది.










