
సిక్కిం: భారత తూర్పు ప్రాంత స్వర్గం సిక్కిం అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. బెంగాల్ వాడి వేడి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇక్కడికి వచ్చాను అని అన్నారు. ఈ సందర్భంగా సిక్కింలో మోడీ మీడియాతో మాట్లాడారు. ఇక్కడికి రాగానే మనసు ఎంతో ఉల్లాసంగా మారిపోయిందని, ప్రకృతి ప్రేమికులు సిక్కిం అందాలు చూడకుంటే ఏమీ చూడనట్టేనని తెలియజేశారు. ఆర్కిట్ మ్యూజియం ఎంతో అద్భుతంగా ఉందని మోడీ పేర్కొన్నారు.









