హైదరాబాద్‌లో ఓ Zepto డెలివరీ బాయ్‌కు ఎదురైన ఘటనపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.తన భార్య ఆస్పత్రిలో ఉందని,ఒక్క డెలివరీ పూర్తి చేసి వెంటనే వెళ్లిపోతానని ట్రాఫిక్ పోలీసులను వేడుకున్నప్పటికీ కనికరించలేదని బాధితుడు వాపోయినట్లు సమాచారం.
డెలివరీ ఆర్డర్ తీసుకునేందుకు వెళ్లే క్రమంలో తన బైక్‌ను రోడ్డు పక్కన నిలిపిన సమయంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి తీసుకెళ్లారని ఆరోపణలు ఉన్నాయి.”నా భార్య హాస్పిటల్లో ఉంది.ఒక్క డెలివరీ చేసి వచ్చేస్తాను సార్” అంటూ పోలీసులను వేడుకున్నా వారు పట్టించుకోలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
వాహన నిబంధనల ఉల్లంఘన జరిగితే చర్యలు తీసుకోవడం పోలీసుల విధి అయినప్పటికీ, అత్యవసర పరిస్థితిని వివరించిన వ్యక్తి విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.









