
హైదరాబాద్: తెలంగాణ మీద ఇంకా ఆంధ్రుల పెత్తనమే నడుస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. గద్దర్ కు సినిమా రంగానికి సంబంధం లేదని అన్నారు. ఎపి సిఎం డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ పై కవిత విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఆంధ్రా కళాకారుల విగ్రహాలు హైదరాబాద్ లో ఎందుకు? అని సెక్రటరేరియట్ ముందు దివంగత ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు? అని కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే పవన్ కల్యాణ్ మీద దేశ ద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ కు తలకాయ లేదని, వేర్పాటు వాదం అంటూ తెలంగాణను అవమానిస్తున్నారని కవిత మండిపడ్డారు.








