
మన తెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న జెఇఇ మెయిన్ 2026 రెండో విడత ఫలితాలు విడుదల అయ్యాయి. సోమవారం మధ్యాహ్నం ఫైనల్ కీ విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ), సాయం త్రం పేపర్ -1 పరీక్ష తుది ఫలితాలను ప్రకటించింది. జెఇఇ మెయిన్ తుది విడత ఫలితాల్లో తె లుగు విద్యార్థులు సత్తాచాటారు. ఈ పరీక్షలో దేశవ్యాప్తంగా 26 మందికి 100 పర్సంటైల్ స్కోరు రాగా వీరిలో ఏకంగా 10 మంది తెలు గు విద్యార్థులే ఉండటం విశేషం. తెలంగాణకు చెందిన డి.భవితేశ్ రెడ్డి, మంథా శివ కామేశ్, సాయి రిత్విక్ రెడ్డి, వివాన్ శరద్ మహిశ్వరి, రిషి ప్రేమ్‌నాథ్ వంద శాతం పర్సంటైల్ సాధించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కి చెందిన జొన్నల రోషన్ మణిదీప్ రెడ్డి, నరేంద్ర బాబు గారి మ హిత్, తుంగా దుర్గా సుప్రభాత్, పసల మోహి త్, బిజ్జం వెంకట చంద్ర శేఖర్ రెడ్డి 100 శాతం పర్సంటైల్‌తో సత్తా చాటారు.
పరీక్ష రాసిన 10,34,330
మంది విద్యార్థులు
జెఇఇ మెయిన్ -2026 తుది విడత పరీక్షను దే శవ్యాప్తంగా 304 నగరాలలో 566 పరీక్షా కేం ద్రాలతోపాటు విదేశాలలోని 14 నగరాలలో నిర్వహించారు. ఈ నెల 2 నుంచి 8 వరకు జెఇఇ మెయిన్ 2 పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈనెల 11వ తేదీన ప్రొవిజినల్ ఆన్సర్ కీ విడుదల చేసి, అభ్యంతరాలు స్వీకరించారు. కాగా, సోమవారం మధ్యాహ్నం ఎన్‌టిఎ జెఇఇ మెయిన్ తుది కీ విడుదల చేసి, సాయంత్రం ఫలితాలు విడుదల చేసింది.ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 11,10,904 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 10,34,330 మంది(93.11 శాతం) విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పేపర్ 1 (బిఇ/బి.టెక్ కోర్సులు) పరీక్షకు హాజరైన వారిలో 3,26,167 మంది అమ్మాయిలు,
7,08,163 మంది అబ్బాయిలు ఉన్నారు. జెఇఇ మెయిన్ సెషన్ 1, సెషన్ 2 పరీక్షల్లో రెండింటిలో విద్యార్థుల ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి (రెండు విడతలు రాస్తే) తీసుకుంటారు.జెఇఇ మెయిన్ అర్హత సాధించిన వారిలో టాప్ 2.50 లక్షల మంది విద్యార్థులకు జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. మే 17న జరిగే ఈ పరీక్షకు ఏప్రిల్ 23 నుంచి మే 4వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది. అడ్వాన్స్‌డ్‌లో సత్తా చాటిన విద్యార్థులకు జోసా కౌన్సెలింగ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థులు
1.ఆరుష్ సింఘాల్(ఛండీఘర్)
2. జొన్నల రోషన్ మనిదీప్‌రెడ్డి(ఆంధ్రప్రదేశ్)
3. శ్రీయాస్ మిశ్రా(ఢిల్లీ ఎన్‌సిటి)
4. మంత శివ కామేష్(తెలంగాణ)
5. సిద్ధార్థ్ శ్రీకాంత్ అథలె(మహారాష్ట్ర)
6. నరేంద్రబాబు బారి మహిత్(ఆంధ్రప్రదేశ్)
7. తుంగ దుర్గా సుప్రభాత్(ఆంధ్రప్రదేశ్)
8. అర్నవ్ గాంధీ(హర్యానా)
9. శుభమ్ కుమార్(బీహార్)
10. ఆదిత్య గుప్త (ఢిల్లీ ఎన్‌సిటి)
11. తమ్మిన గిరీష్(ఢిల్లీ ఎన్‌సిటి)
12. కబీర్ ఛిల్లార్(రాజస్థాన్)
13. చిరంజీబ్ కర్(రాజస్థాన్)
14. భావేష్ పాత్ర(ఒడిషా)
15. అనయ్ జైన్(హర్యానా)
16. అతర్వ పంజాబీ(ఢిల్లీ ఎన్‌సిటి)
17. అర్నవ్ గౌతమ్(రాజస్థాన్)
18. దొరనాల భవితేష్‌రెడ్డి(తెలంగాణ)
19. పసల మొహిత్(ఆంధ్రప్రదేశ్)
20. మాధవ్ విరాదియా(మహారాష్ట్ర)
21. పురోహిత్ నిమయ్(గుజరాత్)
22. సాయి రిత్విక్‌రెడ్డి వెంకట్రెడ్ వల్ల(తెలంగాణ)
23. వివన్ శరద్ మహీశ్వరి(తెలంగాణ)
24. బిజ్జమ్ వెంకట చంద్రశేఖర్‌రెడ్డి(ఆంధ్రప్రదేశ్)
25. యశ్వర్ధన్(రాజస్థాన్)
26. రిషి ప్రేమ్‌నాథ్(తెలంగాణ)



