హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు రైతులపై విషం కక్కారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం రోజు రైతు డిక్లరేషన్ కు బొంద పెట్టారని అన్నారు. ఈ సందర్భంగా సిద్ధిపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం ఏ పంట కొనమంటే అదే కొంటామంటున్నారని, ఎంత పంట పండితే అంత కొంటామని సిఎం రేవంత్ రెడ్డి చాలా సార్లు చెప్పారని తెలియజేశారు. మక్కలు, జొన్నలు కేంద్రం కొనదు అని ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తిసిందని, కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, రైతు లోకానికి కాంగ్రెస్ నేతలు చెంపలేసుకుని క్షమాపణలు చెప్పాలని సూచించారు.

వరి వేయొద్దు అంటున్నారు సరే..ప్రత్యామ్నాయ పంటలు వేయమంటున్నారు సరే..పంటకొనుగోళ్లపై హామీ ఎందుకు ఇవ్వడం లేదు? ప్రశ్నించారు. ఢిల్లీలో ధర్నా చేశామని, తెలంగాణ ప్రభుత్వం తడిగుడ్డతో రైతుల గొంతు కోస్తోందని బి మండిపడ్డారు. సన్న వడ్లకు ఇస్తామని ప్రచారం చేశారని, కేంద్రం ఎమ్ఎస్పి ప్రకటించిన ప్రకారమే కొంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారని అన్నారు. రాష్ట్రంలో నమ్మకం లేని క్యాబినెట్ కొనసాగుతుందని విమర్శించారు. వడ్లు కొనాలనిపెసర్లు, కందులు, సన్ ప్లవర్ ను 25 శాతమే కొంటారని.. అంటే 75 శాతం ఎవరికి అమ్మాలి? అని రైతులను నడిరోడ్డుపై వదిలి పెడతారా? అని నమ్మించి మోసం చేసిన వాళ్లను ఏమనాలి? అని ప్రశ్నించారు.  పెసర్లు, కందులు, సన్ ప్లవర్ ను 25 శాతమే కొంటారని.. అంటే 75 శాతం ఎవరికి అమ్మాలి? అని రైతులను నడిరోడ్డుపై వదిలి పెడతారా? అని హరీష్ రావు ప్రశ్నించారు.