
హైదరాబాద్ లో ఎసిబి దాడులు కొనసాగుతున్నాయి. భారీగా అక్రమాస్తులను ఎసిబి అధికారులు గుర్తించారు. ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో సోదాలు చేశారు. రూ. 1.10 కోట్లు, భారీగా బంగారం, ల్యాండ్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఖాళీ బాండ్ పేపర్లు, చెక్కులు స్వాధీనం, 2 బ్యాంక్ లాకర్లు ఎసిబి అధికారులు గుర్తించారు. కాసేపట్లో బ్యాంక్ లాకర్లను ఎసిబి తెరవనున్నారు. నరహరి ఆఫీసులు, బంధువుల ఇళ్లు సహా 13 చోట్ల ఎసిబి తనిఖీలు చేశారు. గతంలో రంగారెడ్డి జిల్లాలో ఎడి గా కొంకరి నరహరి పనిచేశారు.











