
హానర్ చైనాలో సరికొత్త 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. కంపెనీకి దీనిని హానర్ X70 ప్రో మాక్స్ పేరిట విడుదల చేసింది. ఇప్పటికే హానర్ X70, హానర్ X70i మోడళ్లను కలిగి ఉన్న X70 శ్రేణిలో ఈ హ్యాండ్‌సెట్ ఒక కొత్త మోడల్. ఈ కొత్త హ్యాండ్‌సెట్‌లో 6.79-అంగుళాల ఆమోలెడ్ స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ఎన్‌హాన్స్‌డ్ ఎడిషన్ చిప్‌సెట్, 50-మెగాపిక్సెల్ కెమెరా, 8,560mAh లిథియం-అయాన్ పాలిమర్ బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు ఫోన్ ఫీచరర్లు, ధర గురించి తెలుసుకుందాం.
హానర్ X70 ప్రో మాక్స్ ధర
హానర్ X70 ప్రో మాక్స్ 8GB + 256GB స్టోరేజ్‌తో కూడిన బేస్ మోడల్ ధర CNY 1,999 (సుమారు రూ.28,000). ఇక 512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 2,399 (సుమారు ₹33,600)గా ఉంది. ఈ పరికరం ఫాంటమ్ పర్పుల్, సన్‌బర్స్ట్ గోల్డ్, బాంబూ గ్రీన్, ఫాంటమ్ నైట్ బ్లాక్ అనే నాలుగు రంగుల ఎంపికలలో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం చైనాలో అమ్మకానికి అందుబాటులో ఉంది.
హానర్ X70 ప్రో మాక్స్ ఫీచర్లు
ఈ ఫోన్‌లో 6,000 నిట్స్ వరకు గరిష్ట ప్రకాశం గల 6.79-అంగుళాల ఆమోలెడ్ స్క్రీన్ ఉంది. ఇది 3,840Hz PWM డిమ్మింగ్, DCI-P3 వైడ్ కలర్ గామట్ కవరేజ్, 1.07 బిలియన్ రంగులకు మద్దతు ఇస్తుంది.ఈ ఫోన్‌కు స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ఎన్‌హాన్స్‌డ్ ఎడిషన్ చిప్‌సెట్, అడ్రినో 810 GPU శక్తిని అందిస్తాయి. అంతేకాకుండా, ఈ పరికరం AI డీఫోకస్ ఐ ప్రొటెక్షన్, నాచురల్ లైట్-లైక్ ఐ ప్రొటెక్షన్, AI స్లీప్ ఎయిడ్ డిస్‌ప్లే, హార్డ్‌వేర్-లెవల్ లో బ్లూ లైట్, అల్ట్రా డార్క్ మోడ్ వంటి ఫీచర్లను కూడా అందిస్తుంది.
ఫోటోగ్రఫీ కోసం, హానర్ X70 ప్రో మాక్స్‌లో f/1.8 అపెర్చర్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS)తో కూడిన 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా ఉంది. ఈ పరికరం 4K వీడియో రికార్డింగ్, 10x డిజిటల్ జూమ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ముందువైపు, ఈ ఫోన్‌లో f/2.0 అపర్చర్, 2D ఫేషియల్ రికగ్నిషన్ సపోర్ట్‌తో కూడిన 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 8,560mAh లిథియం-అయాన్ పాలిమర్ బ్యాటరీ కూడా ఉంది.











