
చాలామంది ఉదయాన్నే తరచుగా అల్పాహారంగా ఏం తినాలనే ప్రశ్న ఎదురవుతుంది. రుచికరమైన,రోజంతా శక్తినిచ్చే టిఫిన్ కోసం చూస్తున్నట్లయితే మొలకెత్తిన శనగలు ఒక గొప్ప ఎంపిక! ఎందుకంటే ఇందులో ఇది పోషకాలు అధికంగా ఉండే సూపర్ ఫుడ్. ఉదయాన్నే వీటిని తినడం ద్వారా ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. దీంతో పదే పదే తినే అలవాటును నివారించవచ్చు. క్రమంగా బరువు కూడా అదుపులో ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం..మొలకెత్తిన శనగలలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, అనేక ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేసి, అనేక వ్యాధులను దూరం చేస్తుంది. మొలకెత్తిన శనగలు తినడం వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మొలకెత్తిన శనగలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
1. మొలకెత్తిన శనగలు ప్రోటీన్‌కు మంచి మూలం. వీటిని తినడం వల్ల శరీరానికి శక్తి క్రమంగా విడుదలవుతుంది. అలసటను తగ్గిస్తుంది. రోజంతా చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది.
2. ఇందులో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మొలకెత్తిన శనగలను క్రమం తప్పకుండా తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
3. బరువు తగ్గాలనుకునే వారికి మొలకెత్తిన శనగలు ఒక అద్భుతమైన ఆహారం. ఎందుకంటే వీటిలో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపును ఎక్కువసేపు నిండుగా ఉన్న భావనను కలిగిస్తుంది. తరచుగా వచ్చే ఆకలి బాధలను నివారిస్తుంది.
4. మొలకెత్తిన శనగలు ప్రోటీన్‌కు మంచి మూలం. ఇవి కండరాల మరమ్మత్తుకు, పెరుగుదలకు సహాయపడతాయి. అందుకే జిమ్‌కు వెళ్లేవారు, క్రీడాకారులు వాటిని తమ ఆహారంలో చేర్చుకుంటారు.
5. వీటిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, అనేక ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి.
6. శనగలలో ఉండే ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి, రక్తపోటును సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
మొలకెత్తిన శనగలను తినడానికి సరైన మార్గం
1. వీటిని అల్పాహారంగా తినడం మంచిది.
2. మొలకెత్తిన శనగలకు ఉల్లిపాయలు, టమోటాలు, నిమ్మకాయ రసం, కొత్తిమీర ఆకులను జోడించడం ద్వారా రుచిని పెంచుకోవచ్చు.
3. ఆరోగ్యానికి మంచిదని అతిగా తినడం మానుకోవాలి.











