
పాకిస్థాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజామ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో భాగంగా ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత శతకం సాధించాడు. 59 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 103 పరుగులు చేశాడు. దీంతొ ఆతడక ప్రాతినిధ్యం వహిస్తున్న పెషావర్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి.. 221 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలలో ఇస్లామాబాద్ బోల్తా పడింది. 151 పరుగులకే ఆలౌట్ అయింది.
అయితే ఈ విజయంతో పెషావర్ ఫైనల్స్‌కి దూసుకెళ్లింది. ఇక బాబర్ ఆజామ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. దీంతో పాటు అనితర సాధ్యమైన రికార్డు సాధించాడు. టి-20 క్రికెట్‌లో కెప్టెన్ హోదాలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా బాబర్ నిలిచాడు. ఈ సెంచరీతో కలిపి టి-20ల్లో బాబార్ కెప్టెన్‌గా 9 సెంచరీలు చేశాడు.విఆ తర్వాతి స్థానాల్లో డెప్లెసిస్ (8 సెంచరీలు), క్లింగెలర్ (7 సెంచరీలు), కోహ్లీ (5 సెంచరీలు), విన్స్ (5 సెంచరీలు) ఉన్నారు.











