
వాషింగ్టన్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ(బిజెపి) ఘన విజయం సాధించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. బెంగాల్ లో చారిత్రక విజయం సాధించినందుకు ప్రధాని మోడీకి ట్రంప్ అభినందనలు తెలిపారు. బెంగాల్ లో బిజెపి మెజారిటీ మార్కును దాటి మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ విజయంపై వైట్ హౌస్ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.. "చారిత్రాత్మక, నిర్ణయాత్మక ఎన్నికల విజయం సాధించినందుకు ప్రధాని మోడికి ప్రెసిడెంట్ అభినందనలు తెలియజేస్తున్నారు" అని అన్నారు.
కాగా.. సోమవారం ప్రకటించిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిజెపి అద్భుతమైన రీతిలో 207 స్థానాలను గెలుచుకుంది. గత 15 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ 80 స్థానాలను గెలుచుకుంది. దీంతో పశ్చిమ బెంగాల్‌లో తొలి ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాషాయ పార్టీ సన్నాహాలు చేస్తోంది.














