నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కోల్‌కతాలోని పరేడ్ గ్రౌండ్‌లో శనివారం ఈ వేడుక జరిగింది. ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో టీఎంసీ (మమతా బెనర్జీ)పై బీజేపీ భారీ విజయం సాధించింది. సువేందు అధికారి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితీన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు తదితరులు హాజరయ్యారు.

The post బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం appeared first on Navatelangana.