అమరావతి: పోలవరం జిల్లా రంపచోడవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పాత గాంధీనగరం మలుపు వద్ద ఆర్టిసి బస్సు బోల్తా పడింది. 40 మంది ప్రయాణికులకు  గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. భద్రాచలం నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాణ నష్టం జరగలేదని అక్కడ వారందరూ ఊపిరిపీల్చుకున్నారు.