యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తాజా కామెంట్స్ మరోసారి సనాతన ధర్మంపై సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. తమిళనాడు పాలిటిక్స్‌లో సనాతన ధర్మంపై నెలకొన్న వివాదాల నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు అర్జున్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చినట్లు చర్చ నడుస్తోంది. తాజాగా అర్జున్ సర్జా మాట్లాడుతూ సనాతన ధర్మం అనేది మతం కాదని, అది ఒక లైఫ్ స్టైల్ అంటూ చెప్పుకొచ్చారు. మన తల్లిదండ్రులను దేవుళ్లలా గౌరవించడం, కుటుంబ విలువలను కాపాడుకోవడం, సమాజంలో ధర్మంతో జీవించడం వంటి గొప్ప విషయాలను సనాతన ధర్మం నేర్పుతుందని తెలిపారు. మన తల్లిదండ్రులను పక్కన పెట్టగలరా? లేదు కదా... అంటూ సనాతన ధర్మం గొప్పతనాన్ని గురించి మాట్లాడారు అర్జున్ సర్జా.