
మేష రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి సినీ కళా రంగంలో ఉన్న వారికి చిరు వ్యాపారస్తులకు మంచి ఫలితాలు సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. గృహంలో ఏర్పడిన చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. దూరపుంత ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రాజకీయరంగంలో ఉన్నవారికి అనుకోని పదవి లభిస్తుంది. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రతిరోజు ఖడ్గమాల స్తోత్రాన్ని చదవండి మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
వృషభ రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సంతానం యొక్క విద్యా విషయాలకు ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. అవసరానికి ధనసహాయం లభిస్తుంది. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నలుగురిలో ప్రత్యేకంగా కనబడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. గో సేవ చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు గ్రీన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మిధున రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. కాంట్రాక్టులు లీజులు లభిస్తాయి. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సంతానం యొక్క విద్యా విషయాలు అనుకూలంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలలో ఎంత కష్టించినా ఫలితం అంతంతమాత్రంగానే ఉంటుంది. రుణాలు చాలా వరకు తీరుస్తారు. ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఏకముఖి రుద్రాక్ష మెడలో ధరించండి. స్త్రీలు మెడలో ఇంద్రాణి రూపు ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కర్కాటక రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. జన్మరాశిలోకి గురువు రావడం వలన శుభవార్తలు వినగలుగుతారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి విజయం సాధిస్తారు. ఉద్యోగపరంగా నూతన ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కుటుంబ విషయాలలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ప్రతిరోజు కూడా ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. సౌర కంకణం చేతికి ధరించండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
సింహ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. శుభకార్యాలు వాయిదా పడతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. గృహనిర్మాణ ప్రయత్నాలలో ఏర్పడిన ఆటంకాలు తొలగిపోతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మే వారికి పాల వ్యాపారస్తులకు లాభాలు అధికంగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం శని గ్రహ స్తోత్రాన్ని చదవండి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం తొలగిపోతుంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కన్యా రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. గుత్తి ఉద్యోగాలపరంగా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ఆరోగ్యపరంగా ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తొలిగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణకు మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. రావలసిన ధనం చేతికి అందుతుంది. టెండర్లు లైసెన్సులు లీజులు లభిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత రాణిస్తారు. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీరు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ప్రతిరోజు కూడా లక్ష్మీనారాయణ స్తోత్రాన్ని చదవండి అలాగే ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు బుధవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
తులారాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలపరంగా మీరు అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండేటట్లు చూసుకుంటే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. కుటుంబ పెద్దలతో చిన్నపాటి వివాదాలు జరుగుతాయి. అనుకోని అవకాశాలు కలిసి వస్తాయి. భూ సంబంధిత విష వ్యవహారాలు క్రయవిక్రయాలు లాభసాధిగా ఉంటాయి. రుణాలు కొంతవరకు తీరుస్తారు. ఇంటాబయట కొందరి ప్రవర్తన మానసిక చికాకు కలిగిస్తుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. శుభకార్యాలు వాయిదా పడతాయి. వ్యాపారమున పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. హౌసింగ్ లోన్లు బ్యాంకు లోన్లు మంజూరు అవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. కుబేర కుంకుమతో ఆరావళి కుంకుమతో అమ్మవారికి పూజ చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
వృశ్చిక రాశి వారికి వారం చాలావరకు అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఆరోగ్యం కుదుటపడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు ఈ వారం కార్యరూపం దాలుస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి. మీ తెలివితేటలతో పదిమందిని మెప్పించ గలుగుతారు. కొన్ని వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఎరుపు రంగు వత్తులతో దీపారాధన చేయండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంక ఏడూ కలిసివచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ధనస్సు రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఈ రాశి వారికి అర్దాష్టమ శని నడుస్తుంది కావున శనికి తైలాభిషేకం చేయించండి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలపరంగా మీరు కోరుకున్న మార్పులు ఏర్పడతాయి. అనుకున్న పనుల్లో అవాంతరాలు తప్పవు. నూతన ఋణయత్నాలు చేస్తారు. విదేశాలలో ఉండి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా శని గ్రహ స్తోత్రాన్ని చదవండి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా రెండు కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
మకర రాశి వారికి వారం చాలావరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. స్నేహితులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆరోగ్యపరమైన సమస్యలు తొలగిపోతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. పదిమందిలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి సినీ కళాకారులకు హోటల్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా అరటి నార వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. ఖర్చులు అధికంగా ఉంటాయి. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. వివాహాది శుభకార్యాలు వాయిదా పడతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వ్యాపారం ప్రారంభించకుండా ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో కొనసాగుతారు. మిత్రుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి. వ్యాపారంలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఈ రాశి వారు ప్రతి రోజు శని గ్రహ స్తోత్రం దుర్గ దేవి స్తోత్రం చదవండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా లావసాటిగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ధన పరంగా చికాకులు తొలగుతాయి. వ్యాపారం అభివృద్ధి బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. వీసా స్టాంపింగ్ కోసం మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు వింటారు. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కావున 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారమున అనుకూలత కలుగుతుంది. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఇంద్రాణి రూపు మెడలో ధరించండి. మగవారు ఏకముఖి రుద్రాక్ష ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.















