న్యూఢిల్లీ : స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎనిమిదో సారి జనభా గణన ప్రక్రియ రూ. 11,728 కోట్లతో చేపట్టారు. 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2027 దేశ జనాభా గణన మొదటి దశ ఇళ్ల జాబితా పూర్తయింది. భారత దేశ చరిత్ర లోనే మొదటిసారిగా పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. ఇక కేరళ, నాగాలాండ్, వంటి రాష్ట్రాల్లో 15 రోజుల పాటు ప్రజలే స్వయంగా తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేప్రక్రియ కొనసాగుతోంది.

ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోని వారి కోసం అధికారులు నేరుగా ఇళ్లకు వచ్చి వివరాలు సేకరిస్తున్నారు. ఈ గణన కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌ను ఉపయోగించి అధికారులు డేటాను సేకరిస్తున్నారు. మంగళవారం హిమాచల్ ప్రదేశ్‌లో ఈ మొదటి దశ గణన ప్రారంభమైంది. గుజరాత్, జమ్ముకశ్మీర్, లద్దాఖ్, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్‌ల్లో ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైంది.