మేషం

మేష రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది. ముఖ్యమైన విషయాలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. ఇప్పటి నుండో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. నూతన విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో దైవదర్శనం చేసుకుంటారు. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఒక స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు. ప్రభుత్వపరంగా రావలసినటువంటి ధనం చేతికి అందుతుంది. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఓం నమో శివాయ భక్తులతో దీపారాధన చేయండి అలాగే శనివారం రోజున నవగ్రహ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు మెరూన్ ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి

వృషభం

వృషభ రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో మీరు కోరుకున్న మార్పులు చోటుచేసుకుంటాయి. కార్యాలయంలో అధికారుల మెప్పు పొందుతారు. మీరు మొదలుపెట్టిన కార్యక్రమాలు లాభసాటిగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు ప్రారంభించిన పనులు సఫలీకృతం అవుతాయి. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. విదేశాలలో ఉన్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. సంతాన విద్యా విషయాలపై సిద్ధ వహించాలి. దైవదర్శనాలు చేసుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. నూతన గృహం కొనుగోలు చేస్తారు. మీ చిరకాల కోరిక నెరవేరుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి బాగుంటుంది. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ప్రతిరోజు కాలభైరవాష్టకం చదవండి. ఈ రాశి వారికి కలిసి వచ్చేసరికి కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

మిధునం

మిధున రాశి వారికి వారం అనుకూలంగా ఉంది. ప్రభుత్వ సంబంధమైన లీజులు కాంట్రాక్టులు టెండర్లు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ లభిస్తుంది. మీరు సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన విషయాలలో తొందరపడి నిర్ణయం తీసుకోకండి. ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అన్ని రంగాల వారికి ఒడిదుడుకులు తప్పవు. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. మంగళవారం మరియు శనివారం రోజున ఆంజనేయ స్వామి వారికి దీపారాధన చేయండి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఖర్చుల పైన దృష్టి పెట్టండి. దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. సహోదరుల మధ్య ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. నూతన ఋణయత్నాలు అనుకూలించవు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో స్వల్ప విభేదాలు తప్పవు. కొన్ని వ్యవహారాలలో అంచనాలు అందుకోవడంలో విఫలమవుతారు. ఉద్యోగ పరంగా పురోగతి సాధిస్తారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. విదేశాలలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఏదైనా ఒక మంగళవారం రోజున సుబ్రమణ్య స్వామి వారికి అభిషేకం చేయించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

సింహం

సింహ రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మీకంటూ ఒక స్థాయిని సంపాదించుకుంటారు. మీ ప్రతిభా పాటవాలు నలుగురిలో వెలుగుల్లోకి వస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం ఆనందం కలిగిస్తుంది. సంతానం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. కీలక సమయంలో సోదరుల నుండి సహాయం అందుతుంది. ఎంతోకాలంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈ వారం శుభవార్త వింటారు. జీవిత భాగస్వామితో చిన్నచిన్న విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఏదైనా ఒక శనివారం నవగ్రహాల దగ్గర నవగ్రహ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

కన్య

కన్యా రాశి వారికి ఈ వారం గడిచిన వారం కంటే బాగుంటుందని చెప్పవచ్చు. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. రావలసిన ధనం చేతికి అందుతుంది. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. సంతాన సంబంధమైన విద్యా విషయాలు బాగున్నాయి. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. విదేశాలలో ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వైద్య వృత్తిలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. శుక్రవారం రోజున లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చేసరికి తొమ్మిది కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

తుల

తులా రాశి వారికి ఈ వారం గడిచిన వారం కంటే బాగుంది. ఆరోగ్యపరంగా ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. మీరు ఏ పని మొదలుపెట్టిన దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మీకు మీరుగా తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ముఖ్యమైన విషయాలను గోప్యంగా ఉంచడం మంచిది. పని పూర్తి అయ్యాక చెప్పండి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సంతాన సంబంధమైన విషయాలు బాగున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా 9 కలిసివచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

వృశ్చికం

వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి. బంధు వర్గం వారితో విభేదాలు తప్పవు. వృధా ఖర్చులు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కలసిరావు. దూరవిద్య కోసం విదేశాలు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంత ఆలస్యం అవుతాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మీకు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సినీ కళా రంగాలలో ఉన్న వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. సోదరులతో ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు బాగుంటాయి. మీ రాశి వారు ప్రతిరోజు కూడా ఎరుపు భక్తులతో దీపారాధన చేయండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టకం పఠించండి. తద్వారా ఉద్యోగపరంగా సంతానపరంగా అభివృద్ధి అనేది బాగుంటుంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు మెరున్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

ధనస్సు

ధనుస్సు రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి అర్థాష్టమ శని నడుస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి సానుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు వహించాలి. కార్యాలయంలో పై అధికారుల వలన కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహం కలుగుతుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. ప్రతి విషయాన్ని బహిర్గతం చేయకుండా రహస్యంగా ఉండేటట్లు చర్య తీసుకోండి. మనవాళ్లే కదా అని కొన్ని ఆంతర్గత విషయాలు చెప్పడం మంచిది కాదు. ఒక ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఎంతోకాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారం మీ కోరిక నెరవేరుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. మీ రాశి వారు దక్షిణామూర్తి రూపు మెడలో ధరించండి. అగోర పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

మకరం

మకర రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి కాలం అంతగా కలిసి రాకపోవచ్చు. వృత్తి ఉద్యోగాలపరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కొన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ వాటిని మీ చాకచక్యంతో అధిగమిస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంత ఆలస్యమైనప్పటికీ కలిసి వస్తాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. వ్యాపార పరంగా ప్రతి విషయంలో కూడా ఫైనాన్స్ పరంగా మీరు దగ్గరుండి చూసుకోవలసిన బాధ్యత మీ మీద ఉంటుంది. దానికి అనుకూలంగానే వ్యాపారంలో లాభనష్టాలు ఆధారపడి ఉంటాయి. అనుకోని ఖర్చులు అనుకోని సంఘటనలు జీవితంలో చోటుచేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు ధనసహాయం అందిస్తారు. విద్యార్థిని విద్యార్థులకు చాలావరకు కాలం అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సంబంధం చేతి వారికి వచ్చి చేజారిపోయే అవకాశం ఉంది కాబట్టి బృగు పాశుపత హోమం చేయించండి వివాహపరంగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి. మరియు శుక్రవారం మంగళవారం రోజున లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

కుంభం

కుంభ రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా వరకు అనుకూల ఫలితాలే కలుగుతాయి. అయితే ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. ముఖ్యమైన విషయాలలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అయినప్పటికీ సొంత నిర్ణయాలు కలిసి రావు కావున పెద్దల సలహాలు సూచనలు పాటించండి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి స్థానచరణం కలుగుతుంది. విలాసాలకు దూర్వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగుల యత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. శుభకార్యాల నిమిత్తం ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. ఎంతోకలంగా వివాహ ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉన్నవారికి ఈవారం ఒక మంచి సంబంధం కుదురుతుంది జాతక పొంతనలు చూసుకొని ముందుకు వెళ్లడం మంచిది. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ధన పరంగా ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. మీ తెలివితేటలతో పదిమందిని మెప్పించ గలుగుతారు. ఎవరైతే విదేశాలు వెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు వారికి చక్కటి అవకాశాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యటం మంచిది. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

మీనం

మీన రాశి వారికి వారం చాలావరకు అనుకూలంగా ఉంది ఆర్థికంగా చాలా వరకు అభివృద్ధిని సాధిస్తారు రుణాలు చాలా వరకు తీరుస్తారు నూతన గృహం కొనుగోలు చేస్తారు కెరియర్ పరంగా మీరు కోరుకున్నాం స్థిరత్వాన్ని ఏర్పరచుకోగలుగుతారు. వ్యాపార పరంగా కూడా అభివృద్ధిని సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ప్రభుత్వపరంగా రావలసినటువంటి ధనం చేతికి అందుతుంది. కాంట్రాక్టులు టెండర్లు లైసెన్సులు లభిస్తాయి. విదేశాలలో ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులు ఒక వ్యవహారంలో అధికారుల నుండి సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. మీరు ఏ పని మొదలుపెట్టిన దిగ్విజయంగా పూర్తి చేస్తారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. నలుగురిలో ప్రత్యేకంగా కనబడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కావున 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి అఘోర పాశుపత హోమం చేయించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.