పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు. భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె, భాజపా అభ్యర్థి సువేందు అధికారి చేతిలో సుమారు 10 వేలకుపైగా ఓట్ల తేడాతో పరాజయం పొందారు.

ఇప్పటికే 2021 ఎన్నికల్లో కూడా సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీ ఓడిన విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో కూడా అదే ఫలితం పునరావృతమవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

రాష్ట్రవ్యాప్తంగా చూస్తే భాజపా భారీ విజయాన్ని నమోదు చేసింది. 200కుపైగా స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి రావడానికి సిద్ధమైంది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కేవలం 72 స్థానాల్లో మాత్రమే గెలుపొందగా, మరో 7 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది.