బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ జగిత్యాల వేదికగా అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ, తనదైన శైలిలో కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.

జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తూ, “హైడ్రా” అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల ఇళ్లను కూల్చడానికే హైడ్రా తీసుకొచ్చారని ఆరోపించిన కేసీఆర్, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే దానిని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం ఆ ఫైల్‌పైనే పెడతానని చెప్పారు.

అదేవిధంగా, మూసీ నది అభివృద్ధి పేరుతో వేలాది ఇళ్లను కూల్చడం సరైందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. “మూసీని బాగుచేయాలంటే పదివేల ఇళ్లు కూల్చాలా?” అని నిలదీశారు. కాంగ్రెస్ పాలన వల్ల అన్ని వర్గాల ప్రజల జీవితం దెబ్బతిన్నదని విమర్శించిన ఆయన, “కాంగ్రెస్ పోవాలి – బీఆర్ఎస్ రావాలి” అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.