నేపాల్‌లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్న వేళ.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ NRI కుటుంబం గల్లంతవడం ఆందోళన కలిగిస్తోంది. మన్యం జిల్లా పాండా వీధికి చెందిన సుభాష్ చంద్ర సాహూ పెద్ద కుమారుడు సంతోష్ లండన్‌లో స్థిరపడ్డారు. భార్య సురభి (43), కుమారుడు స్పందన్ (18), కుమార్తె సైనా (13)తో కలిసి ఇటీవల నేపాల్‌కు వెళ్లారు.
మానస సరోవర్ యాత్రకు వెళ్తుండగా.. వారు ప్రయాణిస్తున్న వాహనం భారీ వరద ప్రవాహంలో గల్లంతైనట్లు సమాచారం.
వాహనం ఆచూకీ కోసం నేపాల్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం బంధువులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
వరదల తీవ్రత కారణంగా సహాయక చర్యలకు కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి. గల్లంతైన NRI కుటుంబం క్షేమంగా బయటపడాలని బంధువులు, స్థానికులు ప్రార్థిస్తున్నారు.









