అమెరికాలోని డల్లాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ (DARA) ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. "Donate Blood – Save Life" అనే సందేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని ఆగస్టు 8, 2026 శనివారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇర్వింగ్ నగరంలోని Outpace LLC (100 E Royal Ln, Irving) ప్రాంగణంలో Carter BloodCare Blood Bus ద్వారా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రక్తదాన శిబిరం కొనసాగనుంది. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు ప్రాణదాతలుగా నిలవాలని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డారా ప్రతినిధులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి డారా అధ్యక్షుడు వీర శివరెడ్డి లేవాక, అధ్యక్షుడిగా ఎన్నికైన గౌతమ్ కాసిరెడ్డి, మాజీ అధ్యక్షుడు గౌతమ్ మియాపురం, కార్యదర్శి మహేంద్ర పద్మరాజు, కోశాధికారి శ్రీని అన్నా రెడ్డి, జాయింట్ ట్రెజరర్ గురు మల్లెల, జాయింట్ ట్రెజరర్ అవినాష్ వెల్లంపాటి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఎగ్జిక్యూటివ్ కమిటీ & బోర్డ్ సభ్యులు
అమర్ కలకాడ, శ్రీధర్ భూమిరెడ్డి, స్వాతి సన్నపురెడ్డి, నిహారిక లోమాడ, సారిత సింగం, మంజుల కొండ, నాగేశ్వర్ అల్లగడ్డ, రమేష్ రెడ్డి దండేల, మల్లికార్జున రెడ్డి బత్తుల, ఇమ్రాన్ బాషా, చంద్రకాంత్ రెడ్డి కర్నాటి, విద్యా సాగర్ పల్లా సభ్యులుగా సేవలందిస్తున్నారు.
అడ్వైజరీ & స్టీరింగ్ కమిటీ
రమణ పుట్లూరి, చంద్ర పొట్టిపాటి, రఘునాథ కుమ్మెత, హరి సింగం, లోకేష్ నాయుడు, ఇస్మాయిల్ పెనుకొండ, అనూప్ దేవిరెడ్డి, భాస్కర్ గారిడికోట, సునీల్ దేవిరెడ్డి, జయచంద్ర గజులపల్లి, మధు మల్లు, మల్లికార్జున మురారి, ప్రేమ్ గంగులకుంట, సతీష్ బొమ్మినేని సభ్యులుగా ఈ కార్యక్రమానికి మార్గదర్శకత్వం వహిస్తున్నారు.
రక్తదానం చేయాలనుకునే వారు పోస్టర్‌లోని QR కోడ్ ద్వారా లేదా అందుబాటులో ఉన్న రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా ముందుగానే నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ప్రతి రక్తదానం ఒక ప్రాణాన్ని కాపాడగలదని, సమాజానికి ఉపయోగపడే ఈ మహోన్నత సేవలో అందరూ భాగస్వాములు కావాలని DARA విజ్ఞప్తి చేసింది.











