అమెరికాలో నివసిస్తున్న తెలుగు యువతకు జీవిత భాగస్వామి అన్వేషణను సులభతరం చేయడానికి మన అమెరికా తెలుగు సంఘం (MATA) ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇస్తూ “MATA మ్యాట్రిమోనీ – వివాహ పరిచయ వేదిక” పేరుతో ప్రత్యేక మ్యాచ్‌మేకింగ్ కార్యక్రమాన్ని జూన్ 20, 2026న నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అమెరికాలో నివసిస్తున్న అన్ని రకాల వీసా హోల్డర్లు, గ్రీన్ కార్డ్ హోల్డర్లు, అమెరికన్ సిటిజన్లు ఈ వేదిక ద్వారా తమకు అనుకూలమైన జీవిత భాగస్వామిని పరిచయం చేసుకునే అవకాశం పొందనున్నారు.

తెలుగు కుటుంబాల సంప్రదాయాలు, విలువలు, అభిరుచులను దృష్టిలో ఉంచుకుని ఈ వివాహ పరిచయ కార్యక్రమాన్ని రూపొందించినట్లు MATA ప్రతినిధులు తెలిపారు. అమెరికాలో పెరుగుతున్న తెలుగు సమాజానికి ఇది ఒక విశ్వసనీయమైన, సురక్షితమైన వేదికగా నిలుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

MATA కన్వెన్షన్‌కు హాజరయ్యే సభ్యులకు ఈ కార్యక్రమంలో నమోదు పూర్తిగా ఉచితంగా ఉండనుంది. ఆసక్తి గల వధువు, వరులు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి https://tinyurl.com/2026mata-matrimony లింక్‌ను ఉపయోగించవచ్చు లేదా నిర్వాహకులు విడుదల చేసిన QR కోడ్‌ను స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయవచ్చు.

కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం +1 888-7MATAUS (888-762-8287) హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.

అమెరికాలో నివసిస్తున్న తెలుగు కుటుంబాలకు, తమ ఆత్మీయులకు సరైన జీవిత భాగస్వామిని ఎంపిక చేయడంలో ఈ వేదిక అరుదైన అవకాశంగా మారనుందని MATA ప్రతినిధులు పేర్కొన్నారు. తెలుగు వారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి బలమైన కుటుంబ బంధాలకు నాంది పలకడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వారు తెలిపారు.