ప్రేమ కోసం ఓ యువకుడు చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తన ప్రేయసి ఫోన్ ఎత్తలేదనే కారణంతో ఓ యువకుడు ఏకంగా వీధి లైట్ స్తంభం ఎక్కి హైడ్రామా సృష్టించాడు. "ఆమె నా కాల్ లిఫ్ట్ చేసే వరకు నేను కిందికి దిగను" అంటూ స్తంభంపైనే నిలబడి పదేపదే ఆమెకు కాల్స్ చేస్తూ అక్కడున్న వారిని ఆందోళనకు గురిచేశాడు.
స్థానికులు ఎంతగా నచ్చజెప్పినా అతడు కిందికి దిగేందుకు నిరాకరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని హైడ్రాలిక్ క్రేన్ సహాయంతో అతడిని సురక్షితంగా కిందకు దించారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.












