హర్యానాలోని పాల్వాల్‌లో భారీ జాతీయ జెండా ప్రదర్శన నిర్వహించారు. సుమారు 5 కిలోమీటర్ల మేర త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ దేశభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని జాతీయ జెండాను గర్వంగా చేతబూనారు.
భారత త్రివర్ణ పతాకం ఇంత భారీ స్థాయిలో ప్రదర్శించడంతో ఈ కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకుంది. దీంతో పాల్వాల్‌లో పండుగ వాతావరణం నెలకొంది.
దేశభక్తి నినాదాలతో మార్మోగిన ఈ కార్యక్రమం.. భారతీయులందరికీ గర్వకారణంగా నిలిచింది.









