జమ్ముకశ్మీర్‌లోని మానస్బల్ సరస్సు త్రివర్ణ పతాక రంగులతో కనువిందు చేసింది. గందర్‌బల్ డీసీ జతిన్ కిషోర్ నేతృత్వంలో నిర్వహించిన మెగా షికారా ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సుమారు 2 కిలోమీటర్ల పొడవున సాగిన భారీ తిరంగా ప్రదర్శనతో మానస్బల్ సరస్సు దేశభక్తి నినాదాలతో మార్మోగింది. అనంతరం నిర్వహించిన తిరంగా కచేరీ ఆహుతులను ఆకట్టుకుంది.
‘హర్ ఘర్ తిరంగా’ క్యాంపెయిన్-2026లో భాగంగా జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు, యువత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మువ్వన్నెల జెండాపై తమ గౌరవాన్ని చాటుకున్నారు. ఐక్యత, దేశభక్తి, జాతీయ స్ఫూర్తితో మానస్బల్ సరస్సు సందడిగా మారింది.









