పశ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన లబ్ధిదారులకు అందించే సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను భారీగా తగ్గించింది. ఇప్పటి వరకు ఏడాదికి 9 సబ్సిడీ సిలిండర్లు పొందుతున్న లబ్ధిదారులకు ఇకపై కేవలం 4 సిలిండర్లు మాత్రమే రాయితీపై లభించనున్నాయి. ఐదో సిలిండర్ నుంచి మార్కెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. 2016లో ప్రారంభమైన ఈ పథకంలో మొదట ఏడాదికి 12 సిలిండర్లపై సబ్సిడీ ఇచ్చేవారు. గతంలో 12 నుంచి 9కు తగ్గించిన కేంద్రం, ఇప్పుడు 4కు కుదించడం పేద కుటుంబాలకు భారంగా మారనుంది. అయితే లబ్ధిదారుల సగటు వినియోగం నాలుగు నుంచి ఐదు సిలిండర్లే కాబట్టి ఈ నిర్ణయం పెద్దగా ప్రభావం చూపదని పెట్రోలియం శాఖ చెబుతోంది.