గత తొమ్మిదేళ్లలో ఉత్తరప్రదేశ్‌కు రూ.50 లక్షల కోట్లకు పైగా ప్రైవేట్ పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ పెట్టుబడులు అమలైతే 1.10 కోట్లకు పైగా ఉద్యోగాలు సృష్టించబడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఎక్స్‌ప్రెస్‌వేలు, పారిశ్రామిక కారిడార్లు, విమానాశ్రయాలు, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే రూ.15 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు అమలు దశలోకి వెళ్లాయి. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, రక్షణ తయారీ, డేటా సెంటర్లు, ఎగుమతుల రంగాల్లో వేగంగా అభివృద్ధి సాధిస్తున్న ఉత్తరప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది.