E20 పెట్రోల్ అమలుపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత Rahul Gandhi కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ వినియోగాన్ని తప్పుబట్టిన రాహుల్ గాంధీ.. ఇది వాహన యజమానులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోందని ఆరోపించారు.
ఓ వీడియో సందేశంలో కారును పరిశీలిస్తూ మాట్లాడిన రాహుల్.. E20 అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తుందని చెప్పారు. ఈ పెట్రోల్ వల్ల కార్లు, స్కూటర్లు దెబ్బతింటున్నాయని, వినియోగదారులపై అదనపు భారం పడుతోందని ఆరోపించారు.
“సాధారణంగా దాల్‌లో కుచ్ కాలా హై (పప్పులో ఏదో నల్లగా ఉంది) అంటాం.. కానీ ఇక్కడ పూర్తి దాల్‌నే కాలి పోయింది” అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
E20 అమలులో ప్రభుత్వం సరైన క్రమాన్ని పాటించలేదని ఆయన విమర్శించారు. ఈ సమస్యను కాంగ్రెస్ తీవ్రంగా ముందుకు తీసుకెళ్తుందని, ప్రజల వాహనాలు, జీవితాలపై ప్రభావం చూపుతోందని అన్నారు.
అయితే రాహుల్ గాంధీ వీడియోలో చూపించిన వాహనం E20కు అనుకూలమైనదేనని Bharatiya Janata Party సోషల్ మీడియా వేదికగా స్పందించింది.












