మలేషియా నుంచి కొచ్చికి వెళ్తున్న బాటిక్ ఎయిర్ విమానం OD231లో ఊహించని ఘటన చోటుచేసుకుంది.

విమానం ఆకాశంలో ఉండగానే... ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరవడానికి ప్రయత్నించడంతో క్యాబిన్‌లో కలకలం రేగింది.

అతడిని ఆపేందుకు క్యాబిన్ సిబ్బంది, తోటి ప్రయాణికులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అధికారుల ప్రకారం... నిందితుడిని కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన జంషీర్ అథనిక్కల్‌గా గుర్తించారు.
అతను ఎగ్జిట్ విండో ప్యానెల్‌ను కూడా ధ్వంసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

విమానం కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వెంటనే CISF సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించే చర్యలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.