స్వాతంత్య్ర దినోత్సవ వేళ లోక్‌భవన్ త్రివర్ణ కాంతులతో ముస్తాబైంది. భారత జాతీయ జెండాలోని కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో భవనం మెరిసిపోతోంది. ప్రత్యేక లైటింగ్‌తో లోక్‌భవన్ పరిసరాలు దేశభక్తి భావాన్ని ప్రతిబింబిస్తున్నాయి. భవనం వైభవం, రంగురంగుల వెలుగులు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో త్రివర్ణ కాంతుల్లో మెరిసిన లోక్‌భవన్ దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశభక్తి, గర్వం, ఆనందాన్ని ప్రతిబింబించే ఈ దృశ్యాలు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారుతున్నాయి.
స్వాతంత్య్ర దినోత్సవ వేళ త్రివర్ణ శోభతో వెలిగిన లోక్‌భవన్

Advertisement
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి








