ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త అందే అవకాశం ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాలపై 8.25 శాతం వడ్డీ చెల్లించాలని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం పంపించింది. అయితే ఇప్పటివరకు తుది ఆమోదం లభించలేదు.
ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఖాతాదారుల ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ నగదు జమ చేయనున్నారు. ఈ ప్రక్రియ ఈ నెలలో లేదా వచ్చే నెలలో పూర్తయ్యే అవకాశం ఉందని సమాచారం. దీంతో కోట్లాది మంది ఉద్యోగులు తమ ఖాతాల్లో వడ్డీ జమపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.












