కేరళలో కంటైనర్‌ లారీకి భారీ అగ్నిప్రమాదం జరిగింది. కాసర్‌గోడ్‌లో విద్యుత్‌ వైర్లను లారీ తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫ్రిజ్‌లను తరలిస్తున్న ఈ కంటైనర్‌ లారీ.. విద్యుత్‌ తీగలకు తగిలిన వెంటనే మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. క్షణాల్లోనే మంటలు లారీ మొత్తం వ్యాపించాయి.

లారీలో ఉన్న ఫ్రిజ్‌లకు కూడా మంటలు అంటుకోవడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ ప్రమాదంలో 30కి పైగా ఫ్రిజ్‌లు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రాణనష్టం జరిగిందా లేదా అన్నదానిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.