నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానానికి నిత్యం భక్తులు కానుకలు సమర్పిస్తూ ఉంటారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన నవ్య రవీంద్రారెడ్డి దంపతులు శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకొని.. దేవస్థానానికి వెండి నాగాభరణం విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఆర్చకులు దాతలను ఆశీర్వదించారు.