నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (NPS)లో జమకాని మీ కాంట్రిబ్యూషన్లు కోల్పోయినట్లు కాదు. PFRDA, SPCPA ద్వారా వాటిని తిరిగి పొందే అవకాశం కల్పిస్తోంది. PRANలో జమకాని నిధులు ఈ ప్రత్యేక ఖాతాలో భద్రపరుస్తారు. 25 సంవత్సరాల లోపు సరైన పత్రాలతో క్లెయిమ్ చేస్తే, అసలు మొత్తంతో పాటు వడ్డీ కూడా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.