అప్పటి తరం నటులు చిరంజీవి, వెంకటేష్, విజయశాంతి, రాధ వంటి వారితో తన అనుభవాలను పంచుకున్నారు. అప్పటి కాలంలో నటీనటుల మధ్య ఎంతో ప్రేమ, ఆత్మీయత ఉండేవని, క్యారవాన్‌లు లేకుండా అందరూ చెట్ల కిందే కూర్చుని భోజనం చేసేవారని ఆమె గుర్తుచేసుకున్నారు.