కరీంనగర్ నగర నడిబొడ్డున ఆదివారం ఉదయం జరిగిన సాయుధ దోపిడీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రముఖ పీఎంజే జ్యువెలరీ షోరూమ్‌ను లక్ష్యంగా చేసుకున్న దుండగులు, కస్టమర్ల ముసుగులో లోపలికి ప్రవేశించి కాల్పులు జరిపి భారీగా బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు.